కల్ట్, వైల్డ్ డ్రామా డానీ
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్(Rizwan Entertainment), కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్ నిర్మాణంలో కళ్యాణ్ జీ గోగణ తెరకెక్కించి చిత్రం ‘డానీ(Danny)’. ఈ సినిమాలో ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్(Ashish Gandhi, Sejal Gupta, Sonal Singh, Azhar Khan) ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 20న విడుదల చేయబోతోన్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ.. “ఇదొక కల్ట్ వైల్డ్ డ్రామా. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా” అన్నారు.
దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ మాట్లాడుతూ.. “ఇలాంటి ఓ డిఫరెంట్ లవ్, రస్టిక్ డ్రామాకి రిజ్వాన్ లాంటి నిర్మాత అయితేనే న్యాయం చేస్తారని అనిపించింది. ఆనంద్ వర్క్ గురించి అందరూ మాట్లాడుకుంటారు” అని చెప్పారు. నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.. “ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది” అని తెలిపారు. నటీనటులు సేజల్ గుప్తా, అజర్ ఖాన్, గీత రచయిత రాకేందు మౌళి, ఏకే ఆనంద్, కె మ్యూజిక్ ప్రతినిధి ప్రియాంక కూడా ఈ వేడుకలో మాట్లాడారు.