తు మిల్ జాయే..

03-11-2026 | 05:25am

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(Bollywood star Shah Rukh Khan) నుంచి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కింగ్(KING)’. దీపికా పదుకొణె(Deepika Padukone) ఇందులో కథానాయిక. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది. అయితే, ఈ సినిమా నుంచి తొలి పాట ‘తు మిల్ జాయే’ను మేకర్స్ విడుదల చేశారు.

కథానాయకుడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పాటతో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. సచిన్-జిగర్ సంగీతం అందించగా.. కుమార్ ఈ పాటకు సాహిత్యం రాశారు. అర్జిత్ సింగ్ అద్భుతమైన గాత్రం, ఎడ్ షీరన్ ప్రత్యేకమైన ర్యాప్ స్టైల్ ఆకట్టుకుంటోంది. పీయూష్-షాజియా కొరియోగ్రఫీ అందించగా, ఎడ్ షీరన్ స్వయంగా ఇంగ్లీష్ ర్యాప్‌ను రాశారు. 

మరిన్ని వార్తలు