పిల్లలు నటించిన పెద్దల సినిమా మాది!
ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై(Dheeraj Mogilineni Entertainments banner) రూపొందుతున్న చిల్డ్రన్ మూవీ ‘సమ్మర్ హాలిడేస్(Summer Holidays)’. దర్శకుడు శ్రీకర్ నయన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 6న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు(Theatrical release) వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ శ్రీకర్. “రెండు వేర్వేరు ప్రపంచాలున్న ఇద్దరు పిల్లలు వేసవిలో స్నేహితులైతే ఎలా ఉంటుందనే పాయింట్ మీద నడిచే కథ ఇది. మాది పిల్లల సినిమా కాదు, పిల్లలు నటించిన పెద్దల సినిమా. అరుణ్, జయసుధ మధ్య వచ్చే సీన్స్ కన్నీళ్లు పెట్టి స్తాయి. మా సినిమాలోని రోహన్, అరుణ్ పాత్రలు ‘సత్యం సుందరం’ సినిమాలోని సత్యం, సుందరం పాత్రల్లా అనిపిస్తాయి” అన్నారు.