మునగనూరులో ఫ్లాగ్‌స్టార్ డిజిటల్ లెర్నింగ్ ల్యాబ్

03-11-2026 | 05:10am

900 మంది బాలికలకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మునగనూరులో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాల(Mahatma Jyotiba Phule BC Residential School), జూనియర్ కళాశాలలో ఫ్లాగ్‌స్టార్ డిజి టల్ లెర్నింగ్ ల్యాబ్‌ను(Flagstar Digital Learning Lab) ప్రారంభించారు. ఫ్లా గ్‌స్టార్ బ్యాంక్ తన సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా నిర్మాణ్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యం తో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. 45 డెస్క్‌టాప్ కంప్యూటర్లతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ద్వారా 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న 900 మంది బా లికలకు డిజిటల్ నైపుణ్యాల్లో(Digital Skills) శిక్షణ అందించనున్నారు.

కాగ్నిజెంట్ ఔట్‌రీచ్ వలంటీర్లు డిజిటల్ అక్షరాస్యత, ఆన్‌లైన్ భద్రత, కోడిం గ్, కంప్యూటేషనల్ థింకింగ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (ఎస్టీఈ ఎం), కృత్రిమ మేధస్సు (ఏఐ) అంశాల్లో శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర విద్యా నియామకాల బోర్డు (ట్రె యిర్బ్) చైర్మన్ బి. సైదులు మాట్లాడుతూ.. బాలికలకు డిజిటల్ విద్యలో సమాన అవకాశాలు కల్పించడంతో పాటు ఉన్నత విద్య, ఉ ద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

ఫ్లాగ్‌స్టార్ బ్యాంక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆపరేషన్స్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్ పి. హిగ్గిన్స్ మాట్లాడుతూ.. డిజిటల్ ప్రపంచంలో బాలికలు పోటీపడి రాణించేందుకు ఈ ల్యాబ్ అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.

కాగ్నిజెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జీసీసీ సర్వీస్ లైన్ గ్లోబల్ హెడ్ శైలజ జోస్యుల, నిర్మాణ్ ఆర్గనైజేషన్ స్ట్రాటజీ అండ్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ శాంతికుమార్ చిలుముల, కాగ్నిజెంట్ బ్యాంకింగ్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ హెడ్ విక్రాంత్ పాటిల్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ డెలివరీ హెడ్ సురేష్ మేడ, హైదరాబాద్ సెంటర్ హెడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రాక్టీస్ లీడర్ రత్న శర్మ కొలాచన, పాఠశాల ప్రిన్సిపాల్ కె. మేఘ, ఫ్లాగ్స్టార్ బ్యాంక్, నిర్మాణ్ ఆర్గనైజేషన్, కాగ్నిజెంట్ ఔట్రీచ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు