డీలిమిటేషన్‌కు బీఆర్ఎస్ మద్దతు
హైదరాబాద్: డీలిమిటేషన్ బిల్లు(Delimitation Bill)కు మద్దతు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పార్టీ వైఖరిని వెల్లడించారు. బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాలని కేటీఆర్ కోరారు. అంతర్రాష్ట్ర లోక్‌సభ సీట్ల నిష్పత్తికి 2051 వరకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రతిపాదిత 50 శాతం సీట్ల పెంపు తమ ఆందోళనలకు పరిష్కారం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదన అమలైతే తెలంగాణలో లోక్‌సభ స్థానాలు ప్రస్తుత 17 నుంచి 26కు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలగకుండా చూడటమే తమ నిర్ణయం వెనుక ఉద్దేశమని కేటీఆర్ తెలిపారు. మహిళా రిజర్వేషన్లకు(Women's Reservation) బీఆర్ఎస్ మొదటి నుంచీ మద్దతు ఇస్తోందని, వాటి అమలుకు పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.