భూ సమస్యల పరిష్కారానికి భూభారతి
నిర్మల్, నవంబర్ 28 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో భూభారతి చట్టం (Bhu Bharati Act) ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూభారతి, ప్రజావాణి, సీఎం ప్రజావాణి, పౌర సేవల ధ్రువీకరణ పత్రాల దరఖాస్తుల పరిష్కారం, ఇసుక అక్రమ తవ్వకాలు, భూ ఆక్రమణల నిర్మూలన తదితర రెవెన్యూ (Revenue) అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న భూభారతి, ప్రజావాణి, సీఎం ప్రజావాణి దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో పారదర్శకత (Transparency) పాటించాలని, అర్హులైన దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు (Public Services) అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవరావు, డీఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.