మాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

09-10-2026 | 01:22pm

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి

కాగజ్ నగర్,(విజయక్రాంతి): మాలి కులస్తులకు హైదరాబాద్‌లో ప్రత్యేక భవనం నిర్మించడంతో పాటు, వారి అభివృద్ధికి మాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar)కు వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్(MLC Dande Vithal) ఆధ్వర్యంలో మాలి కులస్తుల ప్రతినిధులు మంత్రిని కలిసి తమ డిమాండ్లను వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన మాలి కులస్తుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని  కోరారు.

మరిన్ని వార్తలు