ప్రజావాణిలో బీఆర్ఎస్ నేతల అర్జీ

12-10-2026 | 09:51pm

ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ప్రజావాణిలో బీఆర్ఎస్ నేతల అర్జీ

 బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల(Bejjur mandal) కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్(Integrated School) మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం ప్రజావాణిలో అధికారులకు అర్జీ అందజేశారు. బెజ్జూర్ మండలం కాగజ్ నగర్ పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో ఉంది. ఇప్పటివరకు మండలంలో పెద్ద పాఠశాలలు లేకపోవడంతో విద్యార్థులు(Students) ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మగవాళ్లకు (బాలురకు) హాస్టల్ వసతి లేకపోవడంతో చాలా మంది పేద, గిరిజన విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేస్తున్నారు.

బెజ్జూర్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో పాటు బాలుర హాస్టల్ మంజూరు చేస్తే 30కి పైగా గ్రామాల విద్యార్థులకు మేలు జరుగుతుందని ప్రజావాణి నోడల్ అధికారికి ఇచ్చిన అర్జీలో పేర్కొన్నారు. మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి లేక అరా కోరా వసతులతో ఆసుపత్రిలో రోగులు ఇబ్బందులు పడుతున్నారని వైద్య సేవలకు పూర్తిస్తాయిలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని వార్డు సభ్యులు గుమ్మల శ్రీనివాస్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమీరోద్దీన్, చిలుముల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు