జీతాలు చెల్లించాలంటూ ఆసుపత్రి సిబ్బంది ధర్నా

02-10-2026 | 11:33am

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి(Asifabad government hospital)లో పనిచేస్తున్న మల్టీపర్పస్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు(sanitation workers), సెక్యూరిటీ గార్డులు, ఇతర కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. గత ఐదు నెలలుగా జీతాలు చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్(AITUC District President Diwakar) మాట్లాడుతూ.. సిబ్బంది సమస్యలను 15 రోజుల్లో పరిష్కరిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్, కాంట్రాక్టర్ హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. రూ.11 వేల జీతానికి బదులు రూ.9 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. పీఎఫ్, ఈఎస్‌ఐ కార్డులు, యూనిఫాంలు అందలేదన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు