ఎన్ఆర్ఐ పెరెంట్స్ అసోసియేషన్ జిల్లా మెంబర్

04-10-2026 | 04:38pm

రామారావు ఎన్నిక

ఖమ్మం, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ఎన్ఆర్ఐ పెరెంట్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశం(NRI Parents Association District Committee Meeting) ఆదివారం ఖమ్మం నగరంలోని మంచికంటి భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా,రాష్ట్ర ఎన్ఆర్ఐ పెరెంట్స్ అసోసియేషన్ బాధ్యులు, సభ్యులు, తల్లిదండ్రులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలుగా హిమబిందు, ప్రధానకార్యదర్శి గా హనుమంతురావు, జిల్లా కార్యవర్గ సభ్యులుగా శ్రీరామనేని రామారావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన హిమబిందు, హనుమంతరావు, రామనేని రామారావు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అసోసియేషన్ కోసం కృషి చేస్తామని హామి ఇచ్చారు.

మరిన్ని వార్తలు