మాలల వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్నిక
తాడ్వాయి,అక్టోబర్,04( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం మాలల వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ(Malala Welfare Education Society) కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సొసైటీ అధ్యక్షుడిగా గైని రాజలింగం, ఉపాధ్యక్షులుగా ఇటుకల రాజనర్సు,ముద్దు నరేష్, గౌరవాధ్యక్షులుగా పులి ప్రభాకర్,ప్రధాన కార్యదర్శులుగా గోలకొండ స్వామి, మరాటి రమేష్,ప్రచార కార్యదర్శిగా గొల్లబోయిన శ్రీహరి,కార్యదర్శిగా ఆవుల బాలరాజ్,కుదేలు రమేష్ లు ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోల్కొండ నరసింహులు,రాష్ట్ర కమిటీ సభ్యులుగా రాము,జిల్లా కమిటీ అధ్యక్షులు భూంపల్లి సంగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు,జిల్లా కమిటీ మెంబర్ సత్యం తదితరులు పాల్గొన్నారు.