కొణిజర్ల మండలంలో పలు పరామర్శలకు హాజరైన ఎమ్మెల్సీ

02-11-2026 | 05:22pm

ఖమ్మం, కొణిజర్ల, నవంబర్ 2(విజయక్రాంతి): కొణిజర్ల మండలం, తీగలబంజర, మంగాపురం గ్రామాలలో ఇటీవల మరణించిన దొడ్డపనేని లక్ష్మిబాయి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్(MLC Tata Madhusudhan) పరామర్శించారు. అలాగే, మోతుకూరి వెంకటేశ్వర రావు (మాజీ ఎంపీటీసీ) భార్య విజయలక్ష్మి  అనారోగ్యంతో మరణించగా, వారి పార్థీవ దేహానికి ఆయన నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, నాయకులు తాళ్లూరి జీవన్, పోట్ల శ్రీనివాస రావు, చీకటి రాంబాబు, పోగుల శ్రీనివాస్, పాసంగులపాటి శ్రీనివాస్, అనుమోలు శ్రీనివాస్, దొడ్డపనేని రాము, జెట్ల శ్రీనివాస్, అడపా శంకర్ రావు, వడ్లమూడి సైదా బాబు, అనుమోలు మురళి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు