బియ్యం దొంగ ఆళ్ళ మురళి ని వెంటనే అరెస్ట్ చెయ్యాలి

02-11-2026 | 05:52pm
  1. కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులతో నిరసన...
  2. మురళి ని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి
  3. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్

కొత్తగూడెం నవంబర్ 2 విజయ క్రాంతి: బియ్యాన్ని దారిమళ్ళించిన కేసులో ముద్దాయిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు, ఆళ్ళ మురళి ని వెంటనే అరెస్ట్ చెయ్యాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ)(Jai Bhim Rao Bharat Party) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలియజేశారు.

ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ, కొత్తగూడెం పట్టణ 3వ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన క్రైమ్ నెంబర్:202/2026 కేసులో A.1 ముద్దాయిగా ఉన్న ఆళ్ళ మురళి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వారు రైతుల దగ్గర నుండి ,మురళి మేనేజింగ్ పార్టనర్ గా రైస్ మిల్లర్ కు ధాన్యాన్ని అప్పగిస్తే ,రైస్ మిల్లర్ల వాళ్ళు మిల్లింగ్ చేసి తిరిగి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి ,కానీ ఆళ్ళ మురళి అలా చేయకుండా రెండు సంవత్సరాల ఖరీఫ్,రబీ సీజన్ల నుండి సేకరించిన 6కోట్ల91 లక్షల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని అమ్ముకున్న మురళి నీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.

మురళి గతంలో కూడా 2021,2022 లో ఇదేవిధంగా ధాన్యాన్ని మళ్లించిన విషయంలో 3నెలల క్రిందట 2కోట్ల రూపాయలు చెల్లించాడని గుర్తు చేశారు.రైతుల వద్ద నుండి మిల్లర్లు ధాన్యాన్ని సేకరించిన తర్వాత  రెవెన్యూ అధికారులు 15రోజులకు ఒకసారి ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని, కానీ లక్షల రూపాయల మామూళ్ల మత్తుకు అలవాటు పడిన అధికారులు ,రెండు సంవత్సరాలుగా ఇంత పెద్ద బాగోతం నడుపుతున్నా చూసి చూడనట్లు వ్యవహరించారని ఆరోపించారు.

జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి బియ్యం దారి మళ్లించిన ఆళ్ళ మురళి కి సహకరించిన రెవెన్యూ అధికారులపై, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన ఆళ్ళ మురళి ని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,శంకర్,రాంబాబు, కవిత,స్వాతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు