నీటి వృథా అరికట్టేది ఎన్నడో..?

02-11-2026 | 05:44pm

శ్రీరామ్ నగర్ కాలనిలో నల్లాలు లేక వృధాగా పోతున్న మంచినీరు..

గంభీరావుపేట నవంబర్ 02(వినాయక్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో మిషన్ భగీరథ మంచినీరు(Mission Bhagiratha drinking water) చాలా కాలంగా నిత్యం వృధాగా పోతోంది. నల్లాలు లేకపోవడంతో వేలాది లీటర్ల నీరు ప్రతిరోజు వృధా అవుతున్నడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ట్యాపులు ఏర్పాటు చేస్తే నీటి వృధాను అరికట్టాలని పలువురు కాలనీ వాసులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు