మురసు తుఫానుపై మంత్రి తుమ్మల అలర్ట్

03-11-2026 | 11:44am

సత్తుపల్లి, నవంబర్ 03 (విజయక్రాంతి): మురసు తుఫాను ప్రభావంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్రమత్తమయ్యారు. సోమవారం ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి వర్షపాత వివరాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.

జిల్లాలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న వాతావరణ శాఖ (Weather Department) హెచ్చరికల నేపథ్యంలో ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. తుఫాను ప్రభావంతో వరి పంట పరిస్థితి (Paddy Crop) ఎలా ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వల (Water Storage) వివరాలను సైతం తెలుసుకున్నారు.

తుఫాను కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా క్షేత్రస్థాయి సిబ్బంది (Field Staff) అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల సూచించారు.

మరిన్ని వార్తలు