గాయపడ్డ సీనియర్ జర్నలిస్టును పరామర్శించిన మాజీ జెడ్పీటీసీ నాగినేని
ముత్తారం,(విజయక్రాంతి): ఇటీవల రామగిరి మండలం(Ramagiri Mandal)లోని పన్నూరు వద్ద పంది అడ్డం రావడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ముత్తారం మండలంలోని సీనియర్ జర్నలిస్టు ఏరువాక కుమార్ స్వామి(Senior Journalist Yeruvaka Kumar Swamy), కరీంనగర్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ముత్తారం లో తన ఇంటి వద్దే చికిత్స పొందుతున్నాడు. జర్నలిస్టు కుమార్ ను మంగళంవారం మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్ మోహన్ రావు(Former ZPTC Nagineni Jagan Mohan Rao) ఇంటికి వేళ్లి పరామర్శించారు.
ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బాధితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సమయంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని నాగినేని భరోసా ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పీఏసీఎస్ డైరెక్టర్ బొల్నేని బుచ్చంరావు తదితరులు ఉన్నారు.