బాధిత కుటుంబాలకు అండగా ఉంటా

04-10-2026 | 05:04pm

ప్రతి ఒక్కరిని అదుకుంటాం

కామంచికల్ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన మంత్రి పొంగులేటి

* తీర్థాలలో మూడు కుటుంబాలకు పరామర్శ 

ఖమ్మం రూరల్, ఖమ్మం, అక్టోబర్ 4(విజయక్రాంతి): కామంచికల్ ప్రమాద(Comanchical accident) బాధితులందరికి అండగా ఉంటానని, ప్రతి ఒక్కరిని అదుకుంటానని రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) భరోసా ఇచ్చారు. ఇటీవల వ్యవసాయ కూలి పనులకు వెళ్లి వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో(Road accident) మృతి చెందిన కామంచికల్ గ్రామానికి చెందిన దొంతుసరుపు భారతమ్మ(Donthu Sarupu Bharathamma) నివాసానికి వెళ్లి రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం నివాళులర్పించారు.

ఆమె కుటుంబ సభ్యులకు రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించారు. అలాగే...ఆ ప్రమాదంలో గాయపడిన మరో 11 మంది కూలీలకు రూ. 5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులోనూ ఈ కుటుంబాలకు తన వంతు సహకారం అందిస్తూ.. ఉండగా నిలుస్తానని అభయం ఇచ్చారు.

తీర్థాల గ్రామంలో ఇటీవలి కాలంలో వివిధ కారణాలతో చనిపోయిన బానోత్ శాంత, ఎస్ కే. అశ్వాన్, శీతల నాగరాజు ఇళ్లకు వెళ్లి.. వారి చిత్రపటాల వద్ద మంత్రి పొంగులేటి నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

ఈ కార్యక్రమాల్లో..: కాంగ్రెస్ మండల అధ్యక్షులు తోట వీరభద్రం, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, నాయకులు ప్రతాపనేని రఘు, బోడా వెంకన్న, కిరణ్ కుమార్ నాయక్, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు