మాజీ ఎంపీ నామ పర్యటన
ఖమ్మం, తిరుమలాయపాలెం మండలంలో మాజీ ఎంపీ నామ పర్యటన
పలు కుటుంబాలకు పరామర్శ.. కాబోయే వధూవరులకు ఆశీస్సులు
ఖమ్మం,(విజయక్రాంతి): బీఆర్‌ఎస్(BRS) మాజీ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు(Former MP Nama Nageswara Rao) సోమవారం ఖమ్మం కార్పొరేషన్, తిరుమలాయపాలెం మండలంలో పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మామిళ్లగూడెంలో నమస్తే తెలంగాణ బ్యూరో మాటేటి వేణుగోపాల్ తండ్రి శ్రీరామారావు ఇటీవల మృతి చెందడంతో, వారి స్వగృహానికి వెళ్లి శ్రీరామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను నామ పరామర్శించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి రాంనారాయణ, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నారు. అనంతరం ఎన్‌ఎస్‌టి రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ప్రతిజ్ఞ దినపత్రిక ఎడిటర్ వేణు భార్యను నామ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న నామ, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
తిరుమలాయపాలెం మండలం పాపాయిగూడెం గ్రామ వాస్తవ్యులు ఏలూరి సిద్ధార్థ సతీమణి హైమావతి ఇటీవల డెంగీ జ్వరంతో మృతి చెందడంతో, వారి స్వగృహానికి వెళ్లిన నామ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ చామకూరి రాజ్‌కుమార్, మాజీ సర్పంచ్ నామ ప్రసాద్, నాయకులు నామ ప్రభాకర్, ఏలూరి శ్రీనివాసరావు, పరికపల్లి చంద్రశేఖర్, నామ శరత్ తదితరులు పాల్గొన్నారు.
కాబోయే వధూవరులకు నామ ఆశీస్సులు
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో గోడవర్తి శ్రీను కుమారుడు అఖిల్ సాయి, చావా శివరామకృష్ణ కుమార్తె సిరి వెన్నెల నిశ్చితార్థ వేడుకలో నామ పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కనకమేడల సత్యనారాయణ, మోరంపూడి ప్రసాద్ రావు, గొడ్డేటి మాధవరావు, తన్నీరు రవి, వాకదాని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.