గోళ్లపాడులో కాంగ్రెస్‌కు మరింత జోష్
బీఆర్ఎస్ నుంచి 30 కుటుంబాల చేరిక
మంత్రి పొంగులేటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై హస్తం గూటికి
పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలో బీఆర్ఎస్‌కు చెందిన 30 కుటుంబాలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరాయి. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సోమవారం ఈ చేరికలు జరిగాయి. ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ మంత్రి పొంగులేటి.. ఇందిరమ్మ ఇళ్ల శీనన్నగా మన్ననలు పొందుతున్నారని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందన్నారు.
గోళ్లపాడు గ్రామంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అంతర్గత రహదారుల విస్తరణ, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు మంత్రి పొంగులేటి చొరవతో పూర్తయ్యాయని తెలిపారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు గడ్డమీద ఉపేందర్, మాజీ ఉపసర్పంచ్ దొంతిసర్పు రాంబాబు, మాజీ వార్డు సభ్యుడు చీకటిమళ్ల లక్ష్మీనారాయణ, గౌడ సంఘం నాయకుడు మడికంటి శ్రీను, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు రుద్ర మధు, ఎస్సీ నాయకుడు పొన్నెకంటి రాంబాబు తదితరులు ఉన్నారు.