యజ్ఞవరాహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

28-10-2026 | 11:31am

ముకరంపుర, అక్టోబర్ 28(విజయక్రాంతి) : కరీంనగర్‌లోని(Karimnagar) సర్వవైదిక సంస్థానమ్ ట్రస్ట్, యజ్ఞవరాహ క్షేత్రంలో  యజ్ఞవరాహస్వామి చత్వారింశతమ 40వ వార్షిక బ్రహ్మోత్సవాలు(Annual Brahmotsavams) అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 28వ తేదీ బుధవారం నుండి నవంబర్ 2వ తేదీ సోమవారం వరకు జరగనున్నాయి.

ఈ పవిత్ర మహోత్సవానికి హాజరుకావాలని బిజెపి(BJP) రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావు(Yadagiri Sunil Rao)ను... ఆలయ కమిటీ సభ్యులు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను(Invitation Card) అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నరేందర్, వెంకట్రాములు, వెంకటేశ్వర రెడ్డి, రాణి, మరియు రవీందర్ రావు లు కలిసి ఆహ్వానాన్ని అందించడం జరిగింది.

మరిన్ని వార్తలు