ధరల దడ

28-10-2026 | 05:30am

ఎల్ నినో ఎఫెక్ట్.. నిత్యావసర వస్తువుల రేట్లు పైపైకి!

  1. బియ్యం మొదలు పప్పులు, నూనెలు, కూరగాయలు.. అన్నీ పిరమే
  2. భారంగా సాగుతున్న సామాన్యుడి బతుకుబండి
  3. నెలవారీ కుటుంబ ఖర్చులు డబుల్ 
  4. రూ. 350 పెరిగిన 25 కిలోల సన్నబియ్యం బస్తా
  5. కేజీ కందిపప్పు రూ.126 నుంచి 143కు..!
  6.     40% పెరిగిన చక్కెర, రెట్టింపైన ఉల్లిగడ్డ రేట్లు
  7. తగ్గుతున్న దిగుబడులు.. మరింత మండనున్న ధరలు

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఒకవైపు వర్షాభావ పరిస్థితులు(Conditions of rainfall deficiency).. మరోవైపు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు(Prices of essential commodities).. సామాన్యుడి బతుకు బండిని ఆగం చేస్తున్నాయి. ఎల్ నినో ప్రభావంతో(impact of El Niño) ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైంది. పంటల దిగుబడి అంతగా లేదు. మరో నాలుగైదు నెలలు ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఫలితంగా ఇప్పటికే బియ్యం మొదలు పప్పు, చింతపండు, కారం, చక్కెర, నూనె, కూరగాయలు(Lentils, tamarind, chili powder, sugar, oil, vegetables).. ఇలా అన్నింటి ధరలు పెరిగిపోయాయి. ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.  రోజువారీ కూలీ నుంచి మధ్యతరగతి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరి కుటుంబ బడ్జెట్‌లో ఆహార ఖర్చుల వాటా(Share of food expenses) పెరిగిపోతున్నది. చాలీచాలని జీతాలకు తోడు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో బతుకు ముందుకు సాగేదెట్ల అని కలవరపడుతున్నారు. 

బియ్యం ధరల బాదుడు

తెలంగాణలో నిత్యావసరాల ధరల పెరుగుదలలో బియ్యం ప్రధానంగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని రకాల సన్నబియ్యం ధరలు కిలోకు రూ.70 నుంచి రూ. 8-2 వరకు పెరిగినట్లు అక్టోబర్ 2026లో వెలువడిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 25 కిలోల బియ్యం బస్తా ధర గతంలో రూ.1,800 ఉండగా... ఇప్పుడు దాదాపు రూ. 2,150కు చేరింది.

అంటే బస్తాపై సుమారు రూ.350 అదనపు భారం పడుతున్నది. దాదాపు సన్నబియ్యం ధరలు 19 నుంచి 20శాతం మేర పెరిగాయి. నెలకు ఒక బస్తా బియ్యం కొనుగోలు చేసే కుటుంబానికి ఈ పెరుగుదల నేరుగా అదనపు ఖర్చుగా మారుతుంది.

పెద్ద కుటుంబాల్లో నెలకు రెండు బస్తాలు అవసరమైతే భారం మరింత ఎక్కువవుతుంది. బియ్యం ధర పెరగడం వల్ల ఇతర సరుకుల కొనుగోళ్లను తగ్గించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతున్నది. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఇది మరింత ఇబ్బందికరంగా మారుతున్నది. ఇప్పటికే వరి సాగు కూడా తగ్గడంతో రానున్న రోజుల్లో సన్న బియ్యం రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు సన్న వడ్ల సాగు తగ్గితే ప్రభుత్వం సేకరించేందుకు సరిపడా రైతుల నుంచి లభ్యం కాని పరిస్థితి తలెత్తుతుంది. దీంతో ప్రభుత్వం రేషన్ బియ్యం సరఫరాలోనూ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. 

పాలు ధరలూ పెరిగే చాన్స్

పాలు, గుడ్లు వంటి ఆహార పదార్థాలు కూడా కుటుంబాల రోజువారీ అవసరాల్లో భాగమే. ఎన్ నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. వర్షాభావంతో పశుగ్రాసం, మేత లభ్యత తగ్గినా పాడి రైతుల నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి.  ఈ పరిస్థితులు కొనసాగితే పాల ఉత్పత్తి వ్యయం పెరిగి, పాల ధరలు కూడా పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయితే.. పాల సేకరణ, సహకార సంస్థల ధరల విధానం, పశుగ్రాసం లభ్యత, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా వాటి పెరుగుదల ఉంటుందని చెప్తున్నాయి.  

పప్పుల ధరలూ పరేషాన్

బియ్యం తర్వాత ప్రతి ఇంట్లో అత్యంత ముఖ్యమైన ఆహార పదార్థాలు పప్పులు. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు వంటి వాటి ధరల్లో పెరుగుదల కనిపిస్తే అది కుటుంబాల నెలవారీ ఖర్చులపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పప్పు ధరలు 7 నుంచి 15శాతం పెరిగాయి. తాజాగా వెలువడిన ధరల నివేదిక ప్రకారం.. కందిపప్పు కిలో ధర రూ.126 నుంచి 143కు, మినపప్పు రూ.120 నుంచి 128కు, పెసరపప్పు రూ.106 నుంచి 112కు, శనగపప్పు రూ.80 నుంచి 90కు ధరలు పెరిగాయి. వర్షాభావ పరిస్థితులు కొనసాగి పప్పుధాన్యాల సాగు, దిగుబడులు దెబ్బతింటే మార్కెట్‌లో సరఫరా తగ్గే ప్రమాదం ఉంది. దిగుమతులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సరుకు, నిల్వలు, డిమాండ్ వంటి అంశాలు కూడా ధరలపై ప్రభావం చూపుతాయి.

చక్కెర, పిండి, నూనె.. అన్నీ భారమే!

చక్కెర, గోధుమ పిండి, ఉప్పు, ఇతర వంటింటి సరుకులు ఒక్కొక్కటి చూస్తే వాటి ధరల పెరుగుదల పెద్దగా అనిపించకపోవచ్చు. కానీ నెలంతా వినియోగించే వస్తువులన్నింటినీ కలిపి లెక్కిస్తే అదనపు ఖర్చు గణనీయంగా ఉంటుంది. చక్కెర ధర కిలోకు రూ.43 నుంచి రూ.60 వరకు  పెరిగింది. టీ, కాఫీ, అల్పాహారం, ఇతర వంటకాల్లో చక్కెర వినియోగించే కుటుంబాలకు ఈ పెరుగుదల కూడా అదనపు భారమే. వంట నూనెలు, గోధుమ పిండి రేట్లు కూడా భారీగా పెరిగాయి. కూరగాయాల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. టమాటా కిలోకు సుమారు రూ.20 నుంచి రూ.50కు పెరగగా, కొన్ని సూపర్‌మార్కెట్లలో రూ.60 వరకు పలుకుతున్నది. ఉల్లిపాయల ధర గతంలో కిలోకు రూ.30గా ఉండగా, ఇప్పుడు రూ.65-- చేరింది. 

మరిన్ని వార్తలు