మణుగూరులో 4.1 కిలోల గంజాయి స్వాధీనం

28-10-2026 | 11:48am

ముగ్గురు వ్యక్తుల అరెస్ట్‌

ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లు సీజ్‌

మణుగూరు, అక్టోబర్ 28(విజయక్రాంతి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) మణుగూరు ఎక్సైజ్‌ స్టేషన్‌(Manuguru Excise Station) పరిధిలో గంజాయి తరలిస్తున్న(Ganja Smuggling) ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్‌ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4.1 కిలోల ఎండు గంజాయితో పాటు ఒక హీరో స్ప్లెండర్‌ ప్లస్‌ ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నెల 27వ తేదీ ఉదయం అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామ సమీపంలోని సీతారామ కెనాల్‌ వద్ద ఎక్సైజ్‌ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, ద్విచక్ర వాహనంపై ఎండు గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారని మణుగూరు ఎక్సైజ్‌ సీఐ కె. నాగేశ్వరరావు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.ఈ దాడుల్లో ఎక్సైజ్‌ ఎస్‌ఐ విజయభాస్కర్‌, ట్రైనీ ఎస్‌ఐ వేణుతో పాటు హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు, ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌, వెంకట్‌, రామకృష్ణ, నరేష్‌, వీరబాబు, రమేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు