మహిళపై లైంగికదాడి నిందితుడి రిమాండ్
ఘట్ కేసర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : ఓ మహిళను మోసం చేసి డబ్బులు తీసుకొని ఆమెపై లైంగికదాడికి(Sexual assault) పాల్పడిన మున్సిపల్ మేనేజర్(Municipal Manager) ను ఘట్ కేసర్ పోలీసులు(Ghatkesar Police) అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇన్ స్పెక్టర్ పి. కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి జిల్లా భువనగిరిలోని ఇందిరానగర్ లో ఉండే ప్రభుత్వ ఉద్యోగి బుగ్గ జగన్మోహన్(Government employee Bugga Jaganmohan) కు మల్లాపూర్ లో ఉంటూ టైలరింగ్ పని చేసే బాధితురాలికి 4 నెలల క్రితం పరిచయమయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగం(Government job) ఇప్పిస్తానని చెప్పి రూ.5 లక్షలు డిమాండ్ చేసిన జగన్మోహన్ బాధితురాలి నుంచి రూ.4.50 లక్షలు తీసుకున్నాడు.
26న ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మల్లాపూర్ లో కారులో ఎక్కించుకుని అంకుషాపూర్ లోని శ్రీనిధి రిసార్ట్స్ కు తీసుకువెళ్లి లైంగిక దాడి జరిపినట్లు తెలిపారు. కారులో నుంచి కిందకు తోసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పీఎస్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు చెంగిచెర్ల నుంచి భువనగిరి వైపు కారులో వెళ్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తర లించినట్లు తెలిపారు. ఇన్ స్పెక్టర్ పి. కిరణ్ నాయకత్వంలో ఎస్సైలు రాఘవేంద్ర, ఎస్ కే హీనా, సిబ్బంది రాజేశ్, పరమేశ్, విద్యాసాగర్, సత్యనారాయణ, మమత కేసు దర్యాప్తులో పాల్గొన్నారు.