మృతుడి కుటుంబానికి 10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలి
మండల గౌడ సంఘం అధ్యక్షులు నాగరాజు డిమాండ్
గుండాల, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఆళ్ళపల్లి మండల(Allapalli Mandal) పరిధిలోని మర్కోడు గ్రామానికి చెందిన కోతి యాదగిరి తాడిచెట్టుపై నుండి పడి చనిపోవడం చాలా బాధాకరమని గుండాల మండల గౌడ సంఘం(Gundala Mandal Goud Association) అధ్యక్షులు గుండెబోయిన నాగరాజు(Gundeboyina Nagaraju), ఉపాధ్యక్షులు మొక్క నరేందర్ లు విచారం వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ప్రభుత్వం స్పందించి 10 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం మాజీ అధ్యక్షులు పల్లెర్ల మొగిలి, మాజీ ఉపాధ్యక్షులు బుస్సనబోయిన సమ్మయ్య, బత్తిని సాయన్న, యాసారపు వెంకన్న, బొంగు సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.