ఉల్లాసంగా సాగిన వాలీబాల్ పోటీలు
23-09-2026 | 03:16pm
జుక్కల్,(విజయక్రాంతి): జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల(Khandeballur Government School) ఆవరణలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు(Volleyball Competitions) బుధవారం నిర్వహించారు. మండలంలోని అన్ని జడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి విద్యార్థులు కౌలాస్, హంగర్గా, జుక్కల్, పెద్ద ఏడ్గి, కేజీబీవీ, ఖండేబల్లూర్ హైస్కూల్ విద్యార్థులు(Students) పొటిలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా ఎంఈఓ తిరుపతయ్య పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. గెలుపొందిన వాలీబాల్ క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఇందులో ప్రధానోపాధ్యాయులు లాలయ్య, హనుమంత్ రెడ్డి, జనార్ధన్, శ్రీనివాస్, పల్లె వారు మారుతి, దానయ్య పాల్గొన్నారు.