మధ్యాహ్న భోజన కార్మికుల హామీలను అమలు చేయాలి

28-10-2026 | 03:16pm

ఎమ్మెల్యే పోచారంకు వినతిపత్రం అందజేసిన ఏఐటియుసి నాయకులు... 

బాన్సువాడ, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బుధవారం వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కి  ఇవ్వడం జరిగింది. వంట కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న జూన్ జూలై ఆగస్టు పెండింగ్ వంట బిల్లులు వెంటనే విడుదల చేయాలి. సెంట్రలైజ్ కిచెన్ విధానం రద్దు చేయాలి అని ఆయన తెలిపారు . కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత వంట కార్మికులకు పదివేల రూపాయలు ఇస్తానన్న ఎన్నికల హామీని వెంటనే అమలు చేయాలని  కోడిగుడ్లను, గ్యాస్ మరియు నిత్యవసర వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేయాలని ఆయన ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు  తెలియజేశారు.

వంట కార్మికులకు గుర్తింపు కార్డులు డ్రెస్ కోడ్ అమలు చేయాలని తెలియజేశారు. వంట కార్మికులకు ప్రమాద బీమా పథకం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంద శంకర్, చెన్నంగారి సురేష్, కమ్మరి రాములు, కూసుకుంట్ల సాయిలు, బాల్రాజ్, ఎస్ స్వరూప, కృష్ణవేణి, సావిత్రి, నాగ గౌడ్, కిషన్, ఎండి హుస్సేన్ బి, సువర్ణ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు