ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి
ఎల్‌నినో ప్రభావం నుంచి తాత్కాలిక ఉపశమనం.. వర్షపు నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసుకోవాలి :మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
కూసుమంచి, అక్టోబర్ 28(విజయక్రాంతి): తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Former Minister Puvvada Ajay Kumar) సూచించారు. తుఫాన్ కారణంగా సంభవించే నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు.
ఎల్‌నినో ప్రభావం నుంచి ప్రస్తుత వర్షాలతో తాత్కాలిక ఉపశమనం లభిస్తున్న నేపథ్యంలో, వర్షపు నీటిని భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కోతకు సిద్ధంగా ఉన్న పంటలు, వర్షాలకు తడిసి నష్టపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు.