ఉచిత ఆయుర్వేద వైద్య పరీక్షలు
22-09-2026 | 06:32pm
కామారెడ్డి, సెప్టెంబర్ 22, (విజయక్రాంతి): 11వ ఆయుర్వేద దినోత్సవం(Ayurveda Day)-2026వ తేదీన ఆయుర్వేద డిస్పెన్సెరీ, కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బుధవారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించబడును. దోమకొండ మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరనీ ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ డా. రాగసుధ ఒక ప్రకటనలో మండల ప్రజలకు తెలియజేశారు. ప్రజలకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలకు పరీక్షించి మందులు ఇవ్వబడును అని తెలిపారు. కీళ్లవాతం నడుము నొప్పి, మెడ నొప్పి, దగ్గు, జలుబు, ఆయాసం, కిడ్నీ రాళ్లు, జీర్ణ సంబంధిత సమస్యలు మొదలగు అన్ని రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు ఇవ్వబడును అని మండల ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ డా.రాగసుధ ప్రకటలో తెలిపారు.