ఉత్తమ రైతు సదానందంకు ఘన సన్మానం

02-11-2026 | 05:21pm

గణపురం,(విజయక్రాంతి): ఇటీవల హైదరాబాద్‌లో ఉత్తమ రైతు అవార్డు అందుకున్న గణపురం మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన రైతు అక్కపెల్లి సదానందంను గ్రామ సర్పంచ్ కొడారి హైమావతి ధనుంజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామస్తులతో కలిసి శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ధంసాని శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి నాగమణి, వార్డు సభ్యులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు