జిల్లా అభివృద్ధికి పునాది వేసిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు

12-10-2026 | 09:33pm

జిల్లా అధికారులను కలిసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి 

భూపాలపల్లి,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి(Former MLA Gandra Venkataramana Reddy) జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma), ఎస్పీ సిరి శెట్టి సంకీర్త్ లతో పాటు జిల్లా కోర్టు, మెడికల్‌ కాలేజీలో అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, విద్యార్థులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.

గండ్ర మాట్లాడుతూ.. కేసీఆర్(KCR) చొరవతో ఏర్పడిన భూపాలపల్లి జిల్లా వల్ల పరిపాలనా సేవలు ప్రజలకు చేరువయ్యాయని, కలెక్టరేట్‌, కోర్టు, మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రి వంటి సదుపాయాలతో జిల్లా అభివృద్ధికి బాటలు పడ్డాయని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి పునాది వేసిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం భూపాలపల్లి అభివృద్ధిపై మరింత దృష్టి సారించి, మిగిలిన కాలంలో మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు