గాంధీ ఆశయాలను ఆచరించడమే నిజమైన నివాళి

02-10-2026 | 02:34pm

కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి, అక్టోబర్ 2 (విజయ క్రాంతి): మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, శాంతి, సహనం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను ఆచరిస్తూ సమాజంలో శాంతి, సమానత్వం, సోదరభావం పెంపొందించాలని సూచించారు. అధికారులు అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో వసంతకుమారి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, గిరిజన సంక్షేమ అధికారి నాగసాగర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు