బీసీ 42 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి
01-10-2026 | 07:15pm
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి
జాతీయ బీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని శివశంకర్ గౌడ్
గణపురం,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్(BC Reservation) వెంటనే అమలు చేసి, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని జాతీయ బీసీ సంఘం(National BC Association) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని శివశంకర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం గణపురం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతుతో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు అఖిలపక్షంగా కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. బీసీ రిజర్వేషన్ అమలు కోసం అవసరమైతే ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేపడతామని తెలిపారు.