అక్కరాజుపల్లిలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

16-09-2026 | 04:46pm

తరిగొప్పుల, సెప్టెంబర్ 16(విజయక్రాంతి): అక్కరాజుపల్లి గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జొన్నగోని నర్సింహులు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎస్సీ సెల్(SC Cell) గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా భోగం అనూప్, ఉపాధ్యక్షులుగా బావండ్ల పెళ్లి జనార్దన్, బండ పర్శరాములు, జనరల్ సెక్రటరీలుగా మంచినీళ్ల గాలయ్య, పాకనాటి యాదయ్య, కార్యదర్శులుగా చింతల వెంకటస్వామి, తాటి పోషయ్య ఎన్నికయ్యారు.నూతన కమిటీ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు