కోతి దెబ్బకు ఆటో బోల్తా.. ఆదుకున్న కానిస్టేబుల్
ధర్మపురి, అక్టోబర్ 5 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి క్రాస్‌రోడ్డు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై అడ్డంగా వచ్చిన కోతిని తప్పించబోయే క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సంకెనపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్‌తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
అదే సమయంలో విధుల్లో భాగంగా అటుగా వెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్ నరేష్ ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. స్థానికుల సహాయంతో బోల్తాపడిన ఆటోను పైకి లేపి, క్షతగాత్రులను ప్రైవేట్ అంబులెన్స్ (Private Ambulance) ద్వారా ధర్మారం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి బాధితులకు సాయం చేసిన కానిస్టేబుల్ నరేష్‌ను స్థానికులు అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సేవలు ప్రశంసనీయమంటూ కొనియాడారు.