రియల్ ఎస్టేట్ బిల్డర్లకు రేరా షాక్.. రూ.25 లక్షల జరిమానా
హైదరాబాద్: తెలంగాణలో రియల్ ఎస్టేట్(Real Estate) రంగంలో నిబంధనల ఉల్లంఘనపై రేరా అధికారులు కొరడా ఝళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సనాలి ఐటీ పార్క్స్ సంస్థ(Sanali IT Parks Company)కు భారీ జరిమానా విధించారు. రేరా చట్టాన్ని(RERA Act) ఉల్లంఘించినందుకు రూ.25 లక్షల ఫైన్ వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
సనాలి ఐటీ పార్క్స్ సంస్థకు విధించిన రూ.25 లక్షల జరిమానాను 30 రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (Telangana Real Estate Regulatory Authority) స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించాలని సంస్థకు ఆదేశాలు ఇచ్చింది.
రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు నిర్మాణ సంస్థలు చట్టబద్ధమైన నిబంధనలు పాటించేలా చూడటం రేరా ప్రధాన బాధ్యత. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకుంటోంది. సనాలి ఐటీ పార్క్స్పై తాజా చర్యతో రేరా నిబంధనలను తేలిగ్గా తీసుకునే బిల్డర్లకు హెచ్చరిక వెళ్లినట్లయింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల విషయంలో నిబంధనలు పాటించకపోతే జరిమానాలు తప్పవనే సంకేతాలు వెలువడ్డాయి.