బెట్టింగ్‌ల అడ్డా అశ్వారావుపేట

14-09-2026 | 05:10am

తాజాగా బూర్గంపాడు యువకుడి సూసైడ్ లేఖలో మండలవాసి పేరు

బెట్టింగై పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి

అశ్వారావుపేట, సెప్టెంబరు 13 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District)లోని అశ్వారావుపేట కేంద్రంగా భారీ ఎత్తున బెట్టింగు(Betting)లు, జూదం, గంజాయి, వ్యభిచారం ,గుట్కా,దొంగ వాహనాల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే ప్రాంతంలో ఇటీ వల భారీ ఎత్తున పేకాట శిబిరాలు నిర్వహిస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే.

ఇది చాలదన్నట్లు.. ప్రస్తుతం బెట్టింగ్ మాఫియా హవా ఇక్కడ నడుస్తోంది. గత మంగళవారం బూర్గంపహాడ్ మండ లంలో నాగేశ్వరరావు అనే వ్యక్తి బెట్టింగ్లో సర్వస్వం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నాగేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడుతూ అశ్వారావుపేట మండలం అసుపాకకు చెందిన వీరూ అనే వ్యక్తి తనను బెట్టింగ్లకు పురిగొల్పాడని, అతని వల్లే తాను సర్వస్వం కోల్పోయినట్టు సూసైడ్ నోట్ రాయడం సంచలనం రేపింది. బెట్టిం గ్లలకు ఆలవాలంగా మారిన అశ్వారావుపేటలో గ్రామీణ ప్రాంతాలకు సైతం ఇది విస్తరించింది.

ఆ లేఖను చూస్తే ఆసుపాకకు చెందిన ఈ వ్యక్తి చాలా కాలంగా వివిధ ప్రాంతాలలో వ్యక్తులతో పరిచ యాలు పెంచుకొని భారీ ఎత్తున బెట్టింగ్లు నిర్వహి స్తున్నట్టు అర్థమవుతోంది. గతంలో వినాయకపు రంలో ఓ వ్యక్తి బెట్టింగ్లకు బానిసై అన్నీ కోల్పోయి అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా దొరి కిన చోటల్లా అప్పులు తెచ్చి తీవ్రంగా నష్టపోయిన వారెందరో ఉన్నారు.

మరికొందరు అప్పులు ఇచ్చిన వారి బాధ భరించలేక. ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బెట్టింగ్ భూతానికి బలైన వారెందరో ఉన్నారు. ఒక్క ఆసుపాకే కాదు.. అశ్వారావుపేట పట్టణంతో పాటు అనేక గ్రామాలలో బెట్టింగ్ రాయుళ్లు పుట్టగొడుగుల్లా విస్తరించి ఉన్నారు. కొందరు బెట్టింగ్ ఆడి అప్పుల పాలైన వారుంటే.. మరికొందరు బెట్టింగ్ లు నిర్వహిస్తూ లక్షల్లో సంపాదిస్తున్న వారూ ఉన్నారు.

అశ్వారావుపేట పట్టణ కేంద్రంగా భారీ ఎత్తున కంప్యూటర్లు, వాటి నిర్వహణ కు కొందరు యువకులను జీతాలకు ఏర్పాటు చేసుకొని మరీ బెట్టింగ్ లను నిర్వహిస్తున్నారంటే  పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ మొదలుకొని ఫుట్ బాల్, కబడ్డీతో పాటు అనేక క్రీడా పోటీలకు బెట్టింగ్ లు కాస్తున్నారు.  రాష్ట్రస్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏడాది పొడవునా ఏదో  ఒక క్రీడలు జరుగుతూనే ఉండడంతో, ఆయా క్రీడలపై బెట్టింగ్ లు నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా  బెట్టింగ్ లు జరుగుతున్నాయి.

ఏదైనా క్రీడ జరిగేట ప్పుడు కొందరు పందెపురాయుళ్లు తెల్లవారుజామునే ఆయా గ్రామాల్లో తిరిగి పందెం కాసేవారి నుంచి నేరుగా డబ్బులు కట్టించు కొని పందాలు పట్టుకుంటారు. గెలిచిన తరువాత గెలిచిన వ్యక్తికి తన కమీషన్ పోగా.. మిగిలిన డబ్బులు అందజేస్తాడు. ఈ విధానంలో స్థానికంగా జరిగే వివిధ రకాల క్రీడా పోటీలపై కూడా పందేలు కడు తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కూడా ఇలాంటివి ఎక్కు వగా జరుగుతాయి. ఆన్ లైన్ లో రోజుకు లక్షల్లో నే ఈ బెట్టింగ్ లు

జరుగుతున్నాయి. బెట్టింగ్ లు నిర్వహించేవారు, పట్టేవారు కొందరు వ్యక్తులు తమను తాము రక్షించుకోవటానికి సోషల్ మీడియా, యూట్యూబర్ వంటి మాధ్యమాలను, రాజకీయ ముసుగులు వేసు కొని తమ అక్రమ కార్యకలాపాలను యథచ్చగా నడిపేస్తున్నారనే ప్రచారం ఉంది. వీరి చేతుల్లో భారీగా డబ్బులు చలామణి అవుతుం డటంతో.. ఎంత డబ్బునైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. తద్వారా సమాజంలో వీరి ఆధిపత్యం బలపడుతోంది. కనీసం ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు బెట్టింగ్ రాయుళ్ల పై ప్రత్యేక దృష్టి పెట్టి కట్టడి చేయాల్సిన  అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు