పోట్ల ఆశయాలతో ఉద్యమిద్దాం

03-11-2026 | 11:37am

సింగరేణి,(విజయక్రాంతి): అమరవీరుల ఆశయ సాధనకు ప్రజలు సంఘటితమై ఉద్యమించాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ అన్న(CPI(ML) New Democracy Secretary Ashok Anna) పిలుపునిచ్చారు. కారేపల్లి మండలం శాంతినగర్ లో  అమరవీరుల వారోత్సవాలలో భాగంగా  పోట్ల రామనర్సయ్య(Potla Ramnarsaiah) 50వ వర్ధంతి సభ భూక్య శివనాయక్ అధ్యక్షతన జరిగిన సభలో అశోక్ అన్న మాట్లాడుతూ... గోదావరి లోయలో భూస్వాములకు వ్యతిరేకంగా, తునికాకు, పోడు భూముల కోసం పోట్ల చేసిన పోరాటాలను కొనియాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను చిలకలగుట్ట అడవిలో కాల్చి చంపిందని విమర్శించారు.ఓపెన్ కాస్ట్ వల్ల శాంతినగర్, టేకులగూడెం గిరిజన రైతులు కోల్పోయిన భూములకు న్యాయం జరిగే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ సభలో చంద్రయ్య, బాలకృష్ణ, వెంకన్న, హరిబాబు, రాంబాబు, రాధ, గురువమ్మ, రాజు, బచ్చల కృష్ణ, రవి, మేస్త్రి వెంకన్న, శ్రీను పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు