సాత్నాల ప్రాజెక్టు గేట్లపై నుంచి నీటి ప్రవాహం

20-09-2026 | 05:20pm

బేల సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోనీ కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు, వాగులు నిండుకుండలా మారుతున్నాయి. సాత్నాల మండలంలో కురిసిన భారీ వర్షాలతో సాత్నాల ప్రాజెక్టు(Sathnala Project)కు వరద నీటి ప్రవాహం పెరిగింది.

ప్రాజెక్టు నీటిమట్టం పెరగడంతో గేట్లపై నుంచి వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. భారీగా నీటి ప్రవాహం కొనసాగితే ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు