పిడుగుపాటుకు మూడు మూగజీవాల మృత్యువాత..

20-09-2026 | 05:15pm

ఆదిలాబాద్, సెప్టెంబర్ 20, (విజయక్రాంతి): ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లోహరా గ్రామ పంచాయతీ(Lohara Gram Panchayat) పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రైతు గైక్వాడ్ సునీల్‌కు చెందిన రెండు ఎద్దులు, ఒక ఆవుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృత్యువాత పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు మూగజీవాలు అక్కడికక్కడే మృతి మృత్యువాత పడటంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు. రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు