బోథ్ అడవులలో పెద్ద పులుల సంచారం

21-09-2026 | 10:54am

15 రోజుల్లో ఐదు పశువులపై దాడి

జంకుతున్న అటవీ సమీప గ్రామాల ప్రజలు

పులుల సంచారంపై అటవీ శాఖ

బోథ్: నేరడిగొండ అడవులలో మూడు పెద్ద పులులు తిష్ట వేశాయి. మహారాష్ట్ర(Maharashtra) అనుకొని ఉన్న ఈ ప్రాంత అడవుల్లో మొదట ఒక పులి మాత్రమే సంచరించింది. ఆ తర్వాత మరో రెండు పులులు రావడం జరిగిందని అటవీశాఖ నిగావర్గాలవారు గుర్తించారు. అయితే పులుల సంరక్షణ పైన అటవీ శాఖ అధికారులు(Forest Department officials) ప్రత్యేక దృష్టి సారించారు. వాటి సంచారం పైన ఎప్పటికప్పుడు నిగా ఉంచి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 

మహారాష్ట్ర నుండి రాక

ఆదిలాబాద్ జిల్లా అడవులను(Forests of Adilabad district) ఆనుకోని ఉన్న ఈ ప్రాంతానికి మహారాష్ట్రలోని పులుల సంరక్షణ కేంద్రం నుండి ఈ ప్రాంతానికి వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మొత్తం మీద ఐదు పులులు సంచరిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలోని భీంపూర్ తలమడుగు బజార్హత్నూర్ మండలంలోని దట్టమైన అడవుల నుండి మహారాష్ట్ర అడవుల మీదుగా వ జర్ అడవుల్లోకి పులులు వస్తూపోతున్నాయి.

కవ్వాల్ అడవుల్లో జాడ లేని పులులు

ఆదిలాబాద్ జిల్లాను ఆనుకొని ఉన్న నేరడిగొండ మండలంలోని కుంటల జలపాతం ఆనుకొని ఉన్న అడవితోపాటు ఇచ్చోడ మండలంలోని అడవులు టైగర్ జోన్ గా ప్రకటించారు. అయితే టైగర్ జోన్ లో పులుల జాడ కనిపించకపోగా వాటి రాక కోసం అటవీశాఖ అధికారులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా పులులు ఉన్నట్లు అధికారులు గుర్తించలేరు. ఒక్క పైసా ఖర్చు లేకుండానే బోత్ నేరడిగోండ అడవులలోకి పులులు వస్తున్నాయి. అయితే ఫులు లకు కావలసినంత ఆహారంగా జంతుజాలం ఉండడంతో అడవుల లో ఉంటున్నాయని అటవీశాఖ వర్గాల వారు అంటున్నారు. 

15 రోజుల్లో ఐదు పశువుల పై దాడి

సోనాల మండలంలో ని చింతల బోరి, పార్టీ , వజ్జర్ గ్రామాల రైతులకు చెందిన పశువులుఅడవుల్లోకి మేత కోసం వెళ్ళిన సమయంలో దాడి చేసి చంపి వేశాయి. 15 రోజుల వ్యవధిలో ఐదు పశువుల పై దాడి చేయడంతో అటవీ సమీప గ్రామాల వారు ఆందోళన చెందుతున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు పులులకు హాని జరగకుండా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఈ ప్రాంత అడవులను పులుల సంరక్షణ కేంద్రంగా అధికారులు గుర్తించినట్లయితే పులుల సంఖ్య మరింత పెరిగే ఆస్కారం ఉందని పరిశీలకులు అంటున్నారు. పులులు సంచరించే ప్రాంతంలో అధికారులు బోర్డులను సైతం ఏర్పాటుచేసి ప్రజలను మరింత అప్రమత్తం చేయడం జరిగింది.

మరిన్ని వార్తలు