పింఛన్..బాంచెన్!
- చేయూత కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు
- ఈసారైనా ఆసరా దక్కేనా?
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): పింఛన్(Pension).. బాంచన్... సారు.. అంటూ అర్హులైన లబ్ధిదారులు(Beneficiaries) ఇంటికి వచ్చిన అధికారులను వేడుకుంటున్నారు. దరఖాస్తు(Application) చేయడం.. అధికారులు రావడం... వివరాలు సేకరించడం... తప్ప... పింఛన్లు మాత్రం అందడం లేదంటూ అర్హులైన వారు చేయూత పింఛన్ల(Cheyutha pensions) కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హాయంలో మంజూరైన పింఛన్లు తప్ప తర్వాత పింఛన్లు మంజూరు కావడం లేదని దరఖాస్తులు మాత్రం మూడుసార్లు చేసుకున్నాం తప్ప పింఛన్ మాత్రం చేతికి అందలేదని పలువురు చేయూత పింఛన్ కోసం అర్హులైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా(Kamareddy District)లో ఆరు వేల మంది కి పైగా చేయూత పింఛన్ కోసం అర్హులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికీ వారికి చేతికి పింఛన్ అందలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనడంతో చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లకు అధికారులు వెరిఫై కోసం వస్తున్నారు. వారిని చూసి అర్హులైన లబ్ధిదారులు పింఛన్ బాంచన్ అంటూ ప్రా దేయపడుతున్నారు. దరఖాస్తులు చేసి నా పింఛన్ పొందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికి మూడుసార్లు దరఖాస్తు చేసుకున్న పింఛను మాత్రం రాలేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 1200 మంది చేయూత పింఛన్ ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లలోకి వచ్చి వెరిఫై చేస్తున్నారు. ఈసారైనా పింఛన్లు వస్తాయా సార్ , గతంలో లాగా వెరిఫికేషన్ చేసుకొని వెళ్లడమే తప్ప పింఛన్లు ఇస్తారా ఇవ్వరా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెరిఫికేషన్ కోసం వచ్చిన అధికారులు మాత్రం తాము వెరిఫికేషన్ చేసుకొని వెళ్తాను ప్రభుత్వం ఇస్తే పింఛన్లు వస్తాయి.
అంటూ తమ పని మాత్రం వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళడమేనని చెప్పడంతో లబ్ధిదారులు బాంచన్.. సారు.. ఈసారైనా పింఛన్ ఇప్పించండి అంటూ ప్రాదేయపడుతున్నారు. మళ్లీ వివరాలు సేకరించి వెళ్లడమేనా... లేక.. ఈసారైనా పింఛన్లు.. వస్తాయా అంటూ... అడుగుతున్నారు. ప్రభుత్వం ఆశలు కల్పిస్తుంది తప్ప ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పింఛన్ల కోసం దరఖాస్తులు చేయడం వరకు బాగానే ఉంది.. అధికారులు వచ్చి వెరిఫికేషన్ చేసుకుని వెళ్లడం వరకు బాగానే ఉంది. పింఛన్లు మాత్రం చేతికి అందడం లేదని... ప్రభుత్వం ఈసారైనా అర్హులైన వారందరికీ చేయూత పింఛన్లు అందించాలని కోరుతున్నారు. అర్హులైన లబ్ధిదారుల ఆశలను ప్రభుత్వం నెరవేరుస్తుందా లేక మళ్ళీ కాలయాపనతో నే నెట్టుకొస్తుందో వేచి చూడాల్సిందే మరి.