అమరేందర్ నోరు అదుపులో పెట్టుకో!

25-10-2026 | 06:30pm

వాస్తవాలు తెలుసుకుని విమర్శించాలి: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేష్‌బాబు

అశ్వాపురం, అక్టోబర్ 25 (విజయక్రాంతి): మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao), ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుపై నిరాధార ఆరోపణలు మానుకోవాలని అశ్వాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్‌బాబు(Oruganti Rameshbabu) బీఆర్‌ఎస్ నేత కోడి అమరేందర్‌ను హెచ్చరించారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రాజకీయ విమర్శలకు(political criticisms) హద్దులుంటాయని, స్థాయి మరిచి మాట్లాడవద్దని హితవు పలికారు. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం(Marellapadu Lift Irrigation Scheme) ద్వారా తుమ్మలచెరువు ఆయకట్టుతో పాటు గొల్లగూడెం ప్రాంతానికి సాగునీరు అందించేందుకు చర్యలు సాగుతున్నాయన్నారు.

మొత్తంగా సుమారు 7 వేల ఎకరాలకు ప్రయోజనం చేకూర్చేలా కృషి జరుగుతోందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావాన్ని(impact of El Nino) దృష్టిలో ఉంచుకుని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వకు ముందస్తు చర్యలు చేపడుతుంటే రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. గత పదేళ్ల పాలనలో అశ్వాపురం రైతులకు బీఆర్‌ఎస్ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. రైతుల పేరుతో రాజకీయ పబ్బం గడుపుకోవడం మానుకోవాలని హితవు పలికారు.

మరిన్ని వార్తలు