4 September, 2026 | 11:36 PM

ఉమ్రిలో ఘనంగా మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం

04-09-2026 | 10:43pm

తలమడుగు,(విజయక్రాంతి): తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌ను రూరల్ సీఐ రహీం పాషా, ఎస్‌ఐ డి. రాధిక ప్రారంభించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సీఐ సూచించారు. క్రీడలతో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. టోర్నమెంట్‌లో విజేతకు రూ.5 వేలు, ద్వితీయ జట్టుకు రూ.3 వేలు, తృతీయ జట్టుకు రూ.2 వేల నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందించనున్నారు.