సర్వీస్ పాయింట్ ముసుగులో వడ్డీ దందా.. వ్యక్తి అరెస్ట్!
ఇచ్చోడ, నవంబర్ 3 (విజయక్రాంతి): కస్టమర్ సర్వీస్ పాయింట్ (Customer Service Point) కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని అధిక వడ్డీకి అప్పులు ఇస్తున్న వ్యక్తిని ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేశారు. అడే కైలాష్ (36) అనే వ్యక్తి సిరిచెల్మ ఎక్స్‌రోడ్‌లోని ఎస్బీఐ బ్యాంకు సమీపంలో సేవా కేంద్రం నిర్వహిస్తున్నాడు. ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండానే అక్రమంగా వడ్డీ వ్యాపారం (Illegal Money Lending) చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుడి వద్ద నుంచి ఖాళీ చెక్కు, బ్యాంకు పాస్‌బుక్, డిపాజిట్ రశీదులు, నకిలీ రబ్బరు ముద్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇచ్చోడ ఎస్హెచ్ఓ బి. ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రజలు అక్రమ వడ్డీ వ్యాపారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వ్యవహారంపై (Police Investigation) కొనసాగుతోంది