5 September, 2026 | 2:53 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

05-09-2026 | 01:40pm

*బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్

ఉట్నూర్, సెప్టెంబర్ 05( విజయక్రాంతి ): రాష్ట్రంలోని విద్యార్థుల  ఫీజు రియంబర్స్మెంట్(Fee Reimbursement) వెంటనే విడుదల చేయాలని బి.ఆర్ ఎస్(BRS) వి  జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ డిమాండ్ చేశారు. నాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్(Bhukya Johnson Naik), బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ (Gellu Srinivas) యాదవ్ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ ఆధ్వర్యంలో ఉట్నూర్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌక్ దగ్గర విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ మండల అధ్యక్షులు పంద్రా జైవంత్ రావు, మాజీ ఎంపీపీ ముచ్చినేని భూమన్న మాజీ వైస్ ఎంపీపీ సలీమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. యూత్ డిక్లరేషన్ పేరుతో యువతకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు వాటిని అమలు చేయకుండా విద్యార్థులు, నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని విమర్శించారు.

జాబ్ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేసి, విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ధరణి రాజేష్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అజ్మీరా జయచంద్ర కోలా సత్తన్న సౌకత్ అలీ మాజీ కోఆప్షన్ సభ్యులు ముజీబ్ ఖాన్ కాటం రమేష్ మునీర్ సిడం సోనేరావు దూట మహేందర్ వసంత్ సత్యం గిరి నాయక్ అన్వేష్ బొడ్డు నరేష్ సులేమాన్ కామెరి రాజు సాజిద్ అలీం అజయ్ నాను సిరాజ్ అంజాద్ కలీం మహేష్ శివ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు