5 September, 2026 | 3:58 PM

గణపురంలో ఘనంగా ఉట్ల పండుగ వేడుకలు

05-09-2026 | 02:33pm

వేషధారణలతో అలరించిన యువకులు, చిన్నారులు 

గణపురం సెప్టెంబర్ 05 (విజయ క్రాంతి): శ్రీకృష్ణ జన్మాష్టమి(Sri Krishna Janmashtami)ని పురస్కరించుకొని గణపురం మండల కేంద్రంలో శనివారం ఉట్ల పండుగ ( Utla festival) వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువకులు చిన్నారులు బలరామ కృష్ణుల వేషధారణలతో ఊరేగింపుగా శ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి(Sita Ramachandra Swamy) దేవాలయానికి చేరుకోగా ఆలయ అర్చకులు కృష్ణమాచార్యులు స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం పట్టాభి సీతారామచంద్ర స్వాముల ఉత్సవమూర్తులతో ఊరేగింపుగా బయలుదేరి బలరామకృష్ణుల వేషధారులు ఉట్లు  కొడుతూ అందరినీ అలరించారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ భజన మండలి భక్త బృందం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు