పార్టీ పటిష్టత కోసం పని చేయండి
02-10-2026 | 07:02pm
బోథ్ అక్టోబర్ 2 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం(BJP President Patangi Brahmanandam) కోరారు. శుక్రవారం నూతనంగా నియమించబడ్డ జిఎస్టి మోర్చా అధ్యక్షులు జాదవ్ గులాబ్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు రాజ్మారే అశోక్ పట్టణ అధ్యక్షులు బాసెట్టి రమేష్ లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలం చేరే విధంగా కృషి చేయాలి అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ముస్తాపూర్ అశోక్ బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జీవీ రమణ మండల అధ్యక్షులు బోరే రవీందర్ లు నియామక పత్రాలు అందించారు.