చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలి

02-11-2026 | 05:41pm

లక్షెట్టిపేట రూరల్, (విజయక్రాంతి) : గూడెం లిఫ్ట్ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలని బిజెపి కిసాన్ మోర్చా(BJP Kisan Morcha) జిల్లా అధ్యక్షులు గోపతి రాజయ్య డిమాండ్ చేశారు. సోమ వారం ఇరిగేషన్ అధికారులకు రైతులు, బీజేపీ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గూడెం లిఫ్ట్ ప్రారంభించినప్పటికీ చివరి ఆయకట్టు వరకు చేరడం లేదని, ఆలస్యంగా వేసిన పంటలు, దూర ప్రాంతాల్లో ఉన్న భూములకు నీరు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు.

మరికొన్ని రోజులు గూడెం లిఫ్ట్ ద్వారా సాగునీరు అందించాలని, అలాగే ప్రాజెక్టులు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు మళ్లించక గత ప్రభుత్వం చేసిన అవినీతి తప్పిదాలను ప్రశ్నిస్తూ దాదాపు 250 టీఎంసీల నీళ్లు దిగువనున్న రాష్ట్రానికి, సముద్రంలోకి వదిలి తెలంగాణను కరువు ఛాయాల్లో నింపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో ఈ కరువు పరిస్థితులు వచ్చాయన్నారు. రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని లిఫ్టు మరికొద్ది రోజులు నడిపించాలని కోరారు.

మరిన్ని వార్తలు