బ్రెయిన్ స్ట్రోక్‌పై అవగాహన అవసరం
న్యూరాలజిస్ట్ డాక్టర్ రాజేష్‌రెడ్డి పాశం
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): అకస్మాత్తుగా మాట తడబడటం, ముఖం ఒకవైపునకు వాలిపోవడం, చేయి లేదా కాలు బలహీనపడటం స్ట్రోక్ లక్షణాలు కావచ్చని డా. రాజేష్‌రెడ్డి పాశం(Dr. Rajesh Reddy Pasam) (కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, డా. రాజేష్ న్యూరో సెంటర్, హస్తినాపురం) తెలిపారు. మెదడుకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడటం లేదా రక్త నాళం చిట్లి రక్తస్రావం జరగడం వల్ల స్ట్రోక్ వస్తుందని వివరించారు. స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలని, ఇంట్లోనే వేచి చూడటం ప్రమాదకరమని పేర్కొన్నారు.
వైద్య పరీక్షలు, మెద డు స్కానింగ్ ఆధారంగా చికిత్స అందిస్తారని తెలిపారు. వైద్యుల సూచన లేకుండా ఆస్పిరిన్ వంటి మందులు ఇవ్వకూడదని హెచ్చ రించారు. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులు, ధూమపానం, అధిక బరువు స్ట్రోక్ ముప్పు ను పెంచుతాయని వివరించారు. స్ట్రోక్ తర్వా త కోలుకునేందుకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీతోపాటు కుటుంబ సభ్యుల సహకారం కూడా ముఖ్యమని తెలిపారు. ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ లక్షణాలపై అవగాహన పెంచుకుని, సకాలంలో వైద్య సహాయం పొందాలని డా. రాజేష్‌రెడ్డి పాశం సూచించారు.