కమీషన్లపై శ్రద్ధ.. కరువుపై లేదా?
మాజీ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్,అక్టోబర్ 28 (విజయక్రాంతి): మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి సహా ఇతర బిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) తెలిపారు. ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడం సిగ్గుచేటని, మీ నిర్లక్ష్యం వల్ల కరువుబారిన పడిన రైతులను, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం మానేసి.. మూసీ ప్రక్షాళన పేరుతో లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామంటారా? అని ప్రశ్నించారు.
కమీషన్లు దండుకోవడంపై ఉన్న శ్రద్ధ.. కరువు బాధిత రైతులను ఆదుకోవడంలో లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు. ‘ఒక వైపు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, మరోవైపు పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు ఎంతకాలం నొక్కుతారు? ఎన్ని రోజులు అణచివేస్తారు.? తెలంగాణ సమాజం మీకు తప్పక బుద్ధి చెబుతుంది. మూసీ ప్రక్షాళన పేరుతో జరుగుతున్న లూటిఫికేషన్ ప్రయత్నాలను తిప్పికొడుతుంది. అరెస్టు చేసిన బిఆర్ఎస్ నాయకులు వెంటనే విడుదల చేయాలి’ అని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
కృష్ణా నీటి వినియోగంలో అబద్ధాలు ప్రచారం
కృష్ణా నీటి వినియోగం విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తూ, తప్పును కప్పి పుచ్చుకుంటున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేఆర్ఎంబీ మీటింగ్ ఎజెండాలో పేర్కొంది నిజమా? మీ ట్వీట్ నిజమా సమాధానం చెప్పండి’ అంటూ ఎక్స్ వేదికగా కౌంటర్ ట్వీట్ చేశారు. నీటి వినియో గంపై కేఆర్ఎంబీకి ఒక లెక్క.. తెలంగాణ ప్రజలకు మరో లెక్క చెబుతారా? అని నిలదీశారు.
21వ కేఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన అధికారిక అజెండాలో 2026 సెప్టెంబర్ 21 నాటికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ 45.791 టీఎంసీల నీటిని బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలించగా, తెలంగాణ ప్రభు త్వం మాత్రం ఎంజీకేఎల్‌ఐఎస్ ద్వారా బేసి న్ పరిధిలోని ప్రాంతాల అవసరాల కోసం కేవలం 10.653 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించినట్లు అజెండాలో పేర్కొన్నదన్నారు. ఎజెండాలో ఇలా ఉంటే మీరు మరో లెక్క చెబుతున్నారు? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘ఈ రెండింటిలో ఏది నిజం? ఏది తప్పు?..కేఆర్ఎంబీకి మీ ప్రభుత్వమే సమర్పించిన గణాంకాలు నిజమైతే, మీరు చేసిన ట్వీట్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నట్లే కదా’ అని నిలదీశారు.